అమరావతి 2 ఆగస్టు (హి.స.)జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణాజిల్లా భట్లపెనుమర్రు లో జన్మించారు. ఈ క్రమంలో నేడు(శనివారం) పింగళి వెంకయ్య 149వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ప్రముఖులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పతాక రూపకర్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన పేరు గడించారు. దేశానికి, రాష్ట్రానికి పింగళి వెంకయ్య నిరుపమాన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి