దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది న్యాయవాదులే.. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం.. న్యాయవాదులు కాంగ్రెస్ కు వెన్నుముక గా ఉన్నారు.. మీరు చేసిన త్యాగాలను ఇపుడు విధ్వంసం చేశారు.. ఎన్నికల విధానాన్ని పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.. బీజేపీ వరుస విజయాల వెనుక చీటింగ్ జరుగుతోంది.. ఇపుడు మన వద్ద ఆధారాలు ఉన్నాయి.. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మేం గెలిచాం.. అసెంబ్లీలో మేం ఓడాం.. ఎన్నికల కమిషన్ కాపీలు స్కాన్ ప్రొటెక్ట్ తో రూపొందించారు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
5
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ