తిరుమల లడ్డూకి 310 సంవత్సరాలు.. ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?
తిరుమల, 3 ఆగస్టు (హి.స.)శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా ప్రసిద్ధి గాంచింది లడ్డూ. ముఖ్యంగా తిరుమల (Tirumala)కు వెళ్లినవారెవరైనా సరే స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకోకుండా తిరిగిరారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తిరు
తిరుమల లడ్డూకి 310 సంవత్సరాలు.. ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?


తిరుమల, 3 ఆగస్టు (హి.స.)శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా ప్రసిద్ధి గాంచింది లడ్డూ. ముఖ్యంగా తిరుమల (Tirumala)కు వెళ్లినవారెవరైనా సరే స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకోకుండా తిరిగిరారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తిరుమల లడ్డూ దేశ, విదేశాల్లోనూ ప్రసిద్ధి గాంచిందంటే అతిశయోక్తి కాదు. అంతటి ఆదరణ పొందుతోన్న తిరుమల లడ్డూకి 310 ఏళ్లు పూర్తయ్యాయి.

మూడు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎన్నో ఏళ్లుగా అంచలంచెలుగా మార్పులు చేస్తూ వచ్చారు తయారీదారులు. నాణ్యత, రుచి, శుచి, శుభ్రతతో తయారు చేస్తూ ప్రపంచంలోనే నంబర్ 1 అనేంతగా లడ్డూ ప్రసాదం ప్రతిష్ఠ సంపాదించుకుంది.

1715 ఆగస్టు 2 వ తేదీన తొలిసారి స్వామివారికి లడ్డూని నైవేద్యంగా సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రసాదానికి పల్లవ రాజవంశం నాటి మూలాలున్నట్లు 1480ల నాటి శాసనాలు చెబుతున్నాయి. 2014లో స్వామివారి లడ్డూ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు (GI TAG) లభించింది. కాగా.. తొలుత లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ (TTD) 8 నాణేలకే విక్రయించేది. క్రమంగా 2, 5, 10, 15, 25 నుంచి ఇప్పుడు రూ.50 కి విక్రయిస్తోంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌తో తిరుమల లడ్డూని బ్లాక్ మార్కెట్లో విక్రయించడం తగ్గింది. డూప్లికేట్ లడ్డూలను ఆన్లైన్లో విక్రయించాలని చాలా మంది ప్రయత్నించగా.. ఒరిజినల్ లడ్డూ టేస్ట్ రాకపోవడంతో దొరికిపోయారు. కొందరు నకిలీగాళ్లకు టీటీడీ నోటీసులు జారీ చేసి.. కేసులు కూడా నమోదు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande