న్యూఢిల్లీ, 3 ఆగస్టు (హి.స.): వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభలో అధికార బీజేపీ బలం మరింత పెరిగింది. ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన ముగ్గురు ఎంపీలు ఈ వారం ఆ పార్టీలో చేరారు. దీంతో పెద్దల సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 102కి చేరింది. 2022 ఏప్రిల్ తర్వాత బీజేపీ సభ్యుల సంఖ్య రెండోసారి 100 మార్క్ దాటింది. రాజ్యసభ ఎంపీలుగా రాష్ట్రపతి నామినేట్ చేసిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్ష్‌వర్ధన్ సింగ్ శ్రింగ్లా, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త సీ సదానందన్ అధికారికంగా బీజేపీలో చేరారు. వీరి చేరికతో ప్రస్తుతం 240 మంది సభ్యులు ఉన్న పెద్దల సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలం మెజార్టీ మార్క్ దాటి 134కి చేరింది. వీరిలో ఐదుగురు నామినేటెడ్ ఎంపీలు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ