హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) నివాసానికి బాంబు బెదిరింపు రావడం (Bomb threat) కలకలం సృష్టించింది. నాగ్‌పుర్‌లోని గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు (Hoax call) అని తేల్చారు. అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్‌పుర్ తులసి బాగ్ రోడ్‌లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్‌గా గుర్తించామన్నారు. విచారణ అనంతరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు