బనకచర్లతో తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లాలని చూశారు : భట్టి విక్రమార్క
తెలంగాణ, ఖమ్మం. 3 ఆగస్టు (హి.స.) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బనకచర్ల ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఖమ్మంలో జరిగిన గిడ్డంగుల సముదాయ భవనాల శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్న
బట్టి విక్రమార్క


తెలంగాణ, ఖమ్మం. 3 ఆగస్టు (హి.స.)

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బనకచర్ల ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఖమ్మంలో జరిగిన గిడ్డంగుల సముదాయ భవనాల శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టారు. బనకచర్ల ద్వారా గోదావరి నీటిని రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దీనివల్ల తెలంగాణకు చెందిన 968 టీఎంసీల నీటి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఏపీ మంత్రి నారా లోకేష్, టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావిస్తూ, వారి నీటి హక్కులను కాజేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ బనకచర్లను వృధా జలాల కోసమే అని చెప్పినప్పటికీ, వరద జలాల్లో కూడా నదీ పరివాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందని భట్టి స్పష్టం చేశారు.గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే ఇటువంటి వివాదాలు తలెత్తాయని ఫైర్ అయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande