చీపురు పట్టి చెత్త ఊడ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
తెలంగాణ, యాదాద్రి భువనగిరి.3 ఆగస్టు (హి.స.) ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు అందరూ గృహప్రవేశం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో మార్
ప్రభుత్వ విప్పు


తెలంగాణ, యాదాద్రి భువనగిరి.3 ఆగస్టు (హి.స.)

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు అందరూ గృహప్రవేశం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ చేసి వారు పలువురిని ఆప్యాయంగా పలకరించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు. రాజపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు తెలుసుకుని చీపురు పట్టి ఊడ్చి, డ్రైనేజీలో చెత్త తీశారు. రాజపేటలో 40 ఇండ్లు మంజూరు కాగా 34 నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలలో లక్ష రూపాయలు ఇండ్ల లబ్ధిదారులకు రుణం తక్షణమే మంజూరు చేస్తున్నామని బిల్లు మంజూరు అయినప్పుడు 20,000 రూపాయలు కట్ అవుతాయని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande