హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై సీఎస్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ రేషన్ కార్డుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్ కలెక్టర్


హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ రేషన్ కార్డుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో హరిచందన, డీఎస్ చౌహాన్ పాల్గొన్నారని.. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. 'గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డుల ఇచ్చిన దాఖలాలు లేవు. చాలామంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు' అని డీఎస్ చౌహాన్ అన్నారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande