యాదాద్రి భువనగిరి, 3 ఆగస్టు (హి.స.)
భువనగిరిలో బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఆదివారం బీభత్సం సృష్టించింది. జగదాపూర్ నుంచి భువనగిరి వైపుకు వచ్చిన లారీ బ్రేకులు ఫెయిల్ అయి జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద ఎదురుగా ఉన్న పాదాచారుల వైపు, ద్విచక్ర వాహనాల మీదికి దూసుకు వెళ్ళింది. దీంతో అక్కడ నడుచుకుంటూ వెళుతున్న వారి మీదికి లారీ వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు తీవ్రస్థాయిలో ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన వారిలో ఒకరిని హైదరాబాదులోని సూరారం కాలనీకి చెందిన సూర్యనారాయణ యాదవ్ గా గుర్తించగా మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..