ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.) జగదీశ్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. కవితమ్మ అని సంబోధిస్తూనే విమర్శలు గుప్పించారు. కవి
జగదీష్ రెడ్డి


హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)

జగదీశ్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. కవితమ్మ అని సంబోధిస్తూనే విమర్శలు గుప్పించారు. కవిత వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన జగదీశ్ రెడ్డి.. 'నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు... కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు 링 గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande