పందికొక్కుల్లా దోచుకున్న మీరు మా గురించి మాట్లాడుతారా?..అద్దంకి దయాకర్ కౌంటర్
హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఖండించారు. కాపలా కుక్కలా ఉంటానని చెప్పి తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమ
అద్దంకి దయాకర్


హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)

కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఖండించారు. కాపలా కుక్కలా ఉంటానని చెప్పి తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ లను విమర్శించే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ లో బహుళ స్థాయి నాయకత్వం ఉందని బీఆర్ఎస్ మాదిరిగా ఒక వ్యక్తి పార్టీ కాదన్నారు. ఆదివారం ఓ వీడియో రిలీజ్ చేసిన ఆయన.. పార్టీ నాయకులు పార్టీ పని చేస్తే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తారన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా బానిసలు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. బీసీల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో వారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande