సైకిల్ పై వచ్చి.. హాస్పిటల్ ను తనిఖీ చేసిన కలెక్టర్
తెలంగాణ, మెదక్. 3 ఆగస్టు (హి.స.) మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఆదివారం ఉదయం సైకిల్ పై మెదక్ నుంచి రామాయం పేటకు వచ్చారు. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల న
మెదక్ కలెక్టర్


తెలంగాణ, మెదక్. 3 ఆగస్టు (హి.స.)

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్

రాజ్ దంపతులు ఆదివారం ఉదయం సైకిల్ పై మెదక్ నుంచి రామాయం పేటకు వచ్చారు. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రిలో ఉన్నటువంటి మందుల నిల్వలను ఆయన పరిశీలించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలన్నారు. పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఎలాంటి రోగాలు దరిచేరవని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande