హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)
ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు
చేస్తోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టంలేకనే బీజేపీ డ్రామాలు చేస్తుందని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఏమీ లేవని గుజరాత్, కర్నాటక లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో ఇక్కడ కూడా అలానే ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఆ చిత్తశుద్ధి లేకనే డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. జనాభా
గతంలో 23 శాతానికి బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే బీజేపీ వాళ్లు నోరు మూసుకుని ఉన్నారన్నారు. బీజేపీ వాళ్లు హిందువులకు కూడా చేసింది ఏం లేదన్నారు. అగర్ బస్తీలపై కూడా జీఎస్టీ విధించారని విమర్శించారు. 42 శాతం రిజ్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నామని అన్నారు. అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని చెప్పారు. ఫామ్ హౌసులో కూర్చుంటే పనులు జరగవని విమర్శించారు. అంతేకాకుండా అధికారం కోసమే కవిత దీక్ష పేరుతో డ్రామా చేస్తోందని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్