హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)
ఇటీవల ఏపీ మంత్రి లోకేష్ బనకచర్లపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు.. లోకేష్ ముందు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి తెలుసుకోండి.. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృశ్య 968 టిఎంసి లు తెలంగాణ కు, 531 టీఎంసీ లు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలని అన్నారు.
మిమ్మల్ని తప్పుదారి పట్టించాడు.. చమురు నిల్వలు పాకిస్తాన్కు చెందినవి కావు..
వరద జలాల లభ్యత పైన ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయిన తరువాత వరద జలాలు లెక్కలోకి వస్తాయి. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి నెలకొందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..