సంక్షేమానికి నిదర్శనం రేవంత్ సర్కారు : మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ, సిద్దిపేట. 3 ఆగస్టు (హి.స.) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి గ్ర
మంత్రి వివేక్


తెలంగాణ, సిద్దిపేట. 3 ఆగస్టు (హి.స.)

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 1,342 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు కాగా ప్రొసీడింగ్స్ అందించారు.

మరో 4026 మంది పాత రేషన్ కార్డులలో పేర్ల మార్పులు, చేర్పులు చేసుకోగా వారికి కూడా ప్రొసీడింగ్స్ అందజేశారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే. హైమావతి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నరు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande