నాగార్జునసాగర్, 3 ఆగస్టు (హి.స.)
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను
ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కాగా ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఆదివారం ఉదయం 9 గంటలకు 6 గేట్ల ద్వారా విడుదల చేసిన అధికారులు 10 గంటలకు మరో నాలుగు గేట్లు మూసి కేవలం 2 గేట్ల ద్వారా 15,310 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం ఇన్ ఫ్లో 62,821 క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఇదిలా ఉండగా ఆదివారం కావడంతో జలాశయం వద్ద పర్యాటకుల తాకిడి మరింత పెరగడంతో పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్