డిగ్రీ కోర్సుల్లో.ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి.తాత్కాలిక షెడ్యూల్
అమరావతి, 3 ఆగస్టు (హి.స.)డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూలు రూపొందించింది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీచేయాలని భావిస్తోంది. ఈలోగా ఈనెల 4 వరకు కాలేజీలు కోర్సులను సింగిల్‌ మేజర్‌లోకి మార్చుకునేందుకు గడువు పొడిగించింది. 7న
డిగ్రీ కోర్సుల్లో.ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి.తాత్కాలిక షెడ్యూల్


అమరావతి, 3 ఆగస్టు (హి.స.)డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూలు రూపొందించింది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీచేయాలని భావిస్తోంది. ఈలోగా ఈనెల 4 వరకు కాలేజీలు కోర్సులను సింగిల్‌ మేజర్‌లోకి మార్చుకునేందుకు గడువు పొడిగించింది. 7న సింగిల్‌ మేజర్‌పై నిబంధనలు జారీ చేయనుంది. 9 నుంచి 16 వరకు కాలేజీలకు యూనివర్సిటీలు అఫిలియేషన్లు మంజూరుచేస్తాయి. 18 నంచి 20వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

21 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు గడువు ఇస్తారు. 27న సీట్లు కేటాయించి, 28 నుంచే తరగతుల ప్రారంభించేందుకు అనుమతిస్తారు. కాగా, ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. విద్యార్థులు నేరుగా కాలేజీలకు వెళ్లి దరఖాస్తు సమర్పిస్తారు. అయితే దానిని కూడా ఆన్‌లైన్‌ చేస్తారు. ఒకవేళ విద్యార్థి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండిటిలోనూ దరఖాస్తు చేసుకుంటే ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో కోరుకున్న కాలేజీలో సీటు రాకపోతే ఆన్‌లైన్‌ ఎంపికలు తర్వాతి ప్రాధాన్యతలో ఉంటాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande