కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే నోరుమెదపరెందుకు? బీజేపీ బీసీ ఎంపీలపై మహేశ్ కుమార్ గౌడ్
నిజామాబాద్, 3 ఆగస్టు (హి.స.) బీసీ బిల్లుపై బీజేపీలోని బీసీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆర్మూర్ లో జనహిత పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన ఆయన.. కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడుతుంటే బీజేపీ ల
మహేశ్ కుమార్ గౌడ్


నిజామాబాద్, 3 ఆగస్టు (హి.స.)

బీసీ బిల్లుపై బీజేపీలోని బీసీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆర్మూర్ లో జనహిత పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన ఆయన.. కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడుతుంటే బీజేపీ లీడర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రధాని మోడీ బీసీలకు చేసిందేమి లేదని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. జనం కోసమే జనహిత పాదయాత్ర అని చెప్పిన ఆయన.. అబద్దాలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయదన్నారు. దేవుడికి, రాజకీయాలకు ముడిపెడుతోందని విమర్శించారు. బీజేపీ

రాజకీయాల్లో ఓపిక ఉండాలని ఓపిక ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు పదవులు తప్పకుండా వస్తాయని అన్నారు. ఒక సామాన్య కార్యకర్త పీసీసీ స్థాయికి ఎదగడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అవుతుందన్నారు. గ్రామాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే ఊరుకోవద్దని పదేళ్లు మీరేం చేశారో అని నిలదీయాలన్నారు. మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande