ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణపై పోక్సో కేసు నమోదు..
హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.) ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ పై పోక్సో కేసు నమోదైంది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ బాలిక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మైనర్ ఫిర్యాదు ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. గతంలో పలువురు యువతులను మోసం చే
కొరియోగ్రాఫర్


హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)

ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ పై పోక్సో కేసు నమోదైంది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ బాలిక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మైనర్ ఫిర్యాదు ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. గతంలో పలువురు యువతులను మోసం చేసినట్లు కృష్ణపై అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇటీవలే కృష్ణ మాస్టర్కు ఓ మహిళతో వివాహం జరిగింది. భార్యకు సంబంధించిన రూ.9.50 లక్షలు నగదు తీసుకుని పరారయ్యాడు. కాగా, సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం మరిచిపోకముందే కృష్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం హాట్ టాపిక్గా మారింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande