రేపటి నుంచే కవిత దీక్ష.. 72 గంటలపాటు నీళ్లు కూడా తాగకుండా..
హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.) గాంధేయ మార్గంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 72 గంటలపాటు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 72 గంటలు నీళ్లు కూడా తాగకుండా గాంధేయ మార్గంలో దీక్ష చేయబోతున్నామన్నారు. దీక్ష కోసం జాగృతి నుంచి ప్రభుత్వాన్
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)

గాంధేయ మార్గంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 72 గంటలపాటు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 72 గంటలు నీళ్లు కూడా తాగకుండా గాంధేయ మార్గంలో దీక్ష చేయబోతున్నామన్నారు.

దీక్ష కోసం జాగృతి నుంచి ప్రభుత్వాన్ని, పోలీసు లను అనుమతి అడిగాము.. అందుకే కోర్టు కు వెళ్ళాము.. కోర్టు నుంచి అనుమతి వస్తుందని అనుకుంటున్నాం.. అన్ని పార్టీలకు లేఖలు ఇచ్చాము.. నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ ఖండించింది.. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం రియాక్ట్ కాలేదు.. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోని పెద్ద నాయకుల హస్తం ఉంది.. అందుకే బీఆర్ఎస్ ఖండించలేదు.. నల్గొండ లో బీఆర్ఎస్ ను నాశనం చేసిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande