మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీ.. ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్
హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.) వీకెండ్ లో డ్రగ్స్ తో చిల్ అవుతున్న ఆరుగురు ఐటీ ఉద్యోగులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం అర్థరాత్రి మొయినాబాద్ లో అరెస్ట్ చేశారు. స్నేహితుడు బర్త్ డే పార్టీలో ఎల్ ఎస్ డి బ్లాట్స్, హష్ ఆయిల్, మద్యంతో పార్టీ చేస
డ్రగ్స్ పార్టీ


హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)

వీకెండ్ లో డ్రగ్స్ తో చిల్ అవుతున్న

ఆరుగురు ఐటీ ఉద్యోగులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం అర్థరాత్రి మొయినాబాద్ లో అరెస్ట్ చేశారు. స్నేహితుడు బర్త్ డే పార్టీలో ఎల్ ఎస్ డి బ్లాట్స్, హష్ ఆయిల్, మద్యంతో పార్టీ చేసుకుంటున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ పై సోదాలు జరిపారు. ఎస్ ఎస్ డి బ్లాట్స్, హష్ ఆయిల్ ను ఎక్స్ సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకు వచ్చినట్లు విచారణలో ఐటీ ఉద్యోగులు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. 3 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande