తెలంగాణ, పెద్దపల్లి. 3 ఆగస్టు (హి.స.)
రామగుండం ఎత్తిపోతల పథకం
ప్రారంభంతో 13 వేల 396 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని, మీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ పట్టు విడవని విక్రమార్కుడు అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా లోని అంతర్ గ్రామ్ మండలం లో ఎత్తిపోతల పథకం ప్రారంభించి ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ నాయకులు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి మంథనిలో ఒక ఎకరానికి నీరు అందలేదన్నారు.
రామగుండం అభివృద్ధికి రాష్ట్రం ఎప్పుడు అండగా ఉంటుందని, హైదరాబాద్ లో ప్రతి ఒక్క నాయకుడిని కలిసి రామగుండం అభివృద్ధి కోసమే ప్రయత్నాలు చేస్తారన్నారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు