భక్తులకు శ్రీవారి.దర్శనం 3.గంటల్లో చేయించడం అసంభవం/ఎల్వీ.సుబ్రమణ్యం
అమరావతి, 3 ఆగస్టు (హి.స.) తిరుమల: భక్తులకు శ్రీవారి దర్శనం 3 గంటల్లో చేయించడం అసంభవమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
భక్తులకు శ్రీవారి.దర్శనం 3.గంటల్లో చేయించడం అసంభవం/ఎల్వీ.సుబ్రమణ్యం


అమరావతి, 3 ఆగస్టు (హి.స.)

తిరుమల: భక్తులకు శ్రీవారి దర్శనం 3 గంటల్లో చేయించడం అసంభవమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ద్వారా శ్రీవారి దర్శనాన్ని ఒక గంటలో చేయిస్తామన్న విధానాన్ని విరమించుకోవాలని సూచించారు.

‘‘నేను వచ్చే దారిలో భక్తుల సంభాషణ విన్నాను. తిరుమల శ్రీవారి దర్శనం గంట, మూడు గంటల్లో చేయిస్తామనే ఆలోచన విధానం గురించి వారు చర్చించారు. శ్రీవారి భక్తులకు 3 గంటల్లో దర్శనం చేయిస్తామనడం అసంభవం. అలా ప్రయత్నం చేయడం క్షేమకరం కాదు. ఏఐని మానవుడు తన శక్తితో ఎంత గ్రహించినా ఆలయంలో పరిమితులు ఉన్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి’’ అని సుబ్రహ్మణ్యం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande