బాపట్ల , 3 ఆగస్టు (హి.స.) ఏపీలోని బాపట్ల జిల్లాలో (Bapatla) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం బల్లికురవ గ్రానైట్ క్వారీలో (Ballycurrawee Granite Quarry) గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా జారిపడి ఆరుగురు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన సమయంలో క్వారీలో 15 మంది కార్మికులు ఉన్నారు. ఘటనా స్థలంలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి