ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. వారం రోజుల ముందే నిలిపివేత
శ్రీనగర్, 3 ఆగస్టు (హి.స.)వారం రోజుల ముందు గానే అమర్ నాథ్ యాత్ర (Amarnath yathra) ముగిసింది. జమ్మూ కశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అధికారులు యాత్రను రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా యాత్రా మార్గాలు చాలా దెబ్బతిన్నాయని, బాల్
ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. వారం రోజుల ముందే నిలిపివేత


శ్రీనగర్, 3 ఆగస్టు (హి.స.)వారం రోజుల ముందు గానే అమర్ నాథ్ యాత్ర (Amarnath yathra) ముగిసింది. జమ్మూ కశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అధికారులు యాత్రను రద్దు చేశారు.

భారీ వర్షం కారణంగా యాత్రా మార్గాలు చాలా దెబ్బతిన్నాయని, బాల్టాల్, పహెల్గాం మార్గాల్లో మరమ్మతు పనులు జరుగుతాయి కాబట్టి యాత్రను నిలిపివేస్తున్నట్టు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురీ (Vijaykumar bidhuri) పత్రికా ప్రకటన ద్వార తెలిపారు. యాత్రను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ రోజు ఆదివారం నుంచి అన్ని మార్గాల్లో యాత్రను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, అమర్ నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9 వరకు యాత్ర కొనసాగాలి. కానీ వాతావరణ పరిస్థితుల ముందస్తుగానే రద్దు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.10 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్‌ను సందర్శించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 5లక్షల మంది అమరనాథ్ ఆలయాన్ని సందర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande