సీఎం చంద్రబాబుకు BRS ఎమ్మెల్యే కీలక విజ్ఞప్తి
తిరుమల, 3 ఆగస్టు (హి.స.)తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల కొండకు చేరుకొని.. భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవా
సీఎం చంద్రబాబుకు BRS ఎమ్మెల్యే కీలక విజ్ఞప్తి


తిరుమల, 3 ఆగస్టు (హి.స.)తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల కొండకు చేరుకొని.. భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) తిరుమల శ్రీవారిని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు.

ఈ రోజు వేకువజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదాలు నాణ్యత, రుచికరంగా ఉందన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో 10 ఎకరాలు కేటాయించారని ఎమ్మెల్యే గంగుల గుర్తుచేశారు. కానీ.. రెండేళ్లుగా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. త్వరగా నిర్మాణ పనులు చేయాలని సీఎం చంద్రబాబును, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై అవసరమైతే సీఎం చంద్రబాబును కలుస్తానని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande