క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం
బాపట్ల, 3 ఆగస్టు (హి.స.)బాపట్ల జిల్లా బల్లికురవ గ్రానైట్ క్వారీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై విచారణ జరపాలని అధికారులను సీఎం ఈ సందర్భంగా
క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం


బాపట్ల, 3 ఆగస్టు (హి.స.)బాపట్ల జిల్లా బల్లికురవ గ్రానైట్ క్వారీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై విచారణ జరపాలని అధికారులను సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు. కాగా, బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాళ్లు మీద పడి ఆరుగురు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో క్వారీలో 15 మంది కార్మికులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande