మోదీ చేతిలో ఈసీ తోలుబొమ్మ: ఖర్గే
న్యూఢిల్లీ, 3 ఆగస్టు (హి.స.) గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగ మూలస్వరూపాన్నే మార్చేసే వారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ప్రచారసభలతో ప్రజలను చైతన్యపరచడం ద్వారా వారికి ఆ భారీ విజయం దక్కక
మోదీ చేతిలో ఈసీ తోలుబొమ్మ: ఖర్గే


న్యూఢిల్లీ, 3 ఆగస్టు (హి.స.) గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగ మూలస్వరూపాన్నే మార్చేసే వారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ప్రచారసభలతో ప్రజలను చైతన్యపరచడం ద్వారా వారికి ఆ భారీ విజయం దక్కకుండా చేసిన ఘనత రాహుల్‌ గాంధీదేనని తెలిపారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం జరిగిన న్యాయవాదుల సదస్సులో మాట్లాడుతూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ చేతిలో తోలుబొమ్మలా ఈసీ మారింది. ప్రత్యేక ముమ్మర సవరణ పేరుతో బిహార్‌లో లక్షల మంది పేదలను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇదే చేయబోతున్నారు’ అని ఖర్గే ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పంపిన సందేశాన్ని సదస్సులో చదివి వినిపించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande