మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..
నెల్లూరు, 3 ఆగస్టు (హి.స.): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విషయంలో ఇవాళ(అదివారం) ఆయనను గుంటూరు సీఐడీ పోలీసులు క
మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..


నెల్లూరు, 3 ఆగస్టు (హి.స.): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విషయంలో ఇవాళ(అదివారం) ఆయనను గుంటూరు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ, రేపు కాకాణిని పోలీసులు విచారించున్నారు. నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. కాకాణిపై న్యాయవాది సమక్షంలో ప్రశ్నలను సంధిస్తున్నారు. రికార్డుల తారుమారు కేసులో 14వ నిందితుడిగా కాకాణి ఉన్నారు. వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసులో ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande