వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం
వారణాసి, 3 ఆగస్టు (హి.స.) ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా పవిత్ర నగరాలైన వారణాసి, ప్రయాగ్‌రాజ్ వరదల తీవ్రతకు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. గంగా, యమునా (ganga yamuna flood) నదులు ఉప్పొ
వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం


వారణాసి, 3 ఆగస్టు (హి.స.)

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా పవిత్ర నగరాలైన వారణాసి, ప్రయాగ్‌రాజ్ వరదల తీవ్రతకు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. గంగా, యమునా (ganga yamuna flood) నదులు ఉప్పొంగి పొర్లుతూ తీరప్రాంతాల్లోని జనజీవితాన్ని ముంచెత్తుతున్నాయి. రహదారులు జలమయమై, ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రక్షణ బృందాలు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస పనుల్లో నిమగ్నమవుతున్నారు. నదుల ఉద్ధృతి తగ్గకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande