కొడాలి నానికి విశాఖ పోలీసుల నోటీసులు.. మరోకేసు నమోదు
విశాఖ పట్టం, 3 ఆగస్టు (హి.స.) ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024లో ఏయూ లా కాలేజీ విద్యార్థిని అంజనప్రియ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసులలో ఆదేశించారు. వైసీపీ ప్రభుత
కొడాలి నానికి విశాఖ పోలీసుల నోటీసులు.. మరోకేసు నమోదు


విశాఖ పట్టం, 3 ఆగస్టు (హి.స.) ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024లో ఏయూ లా కాలేజీ విద్యార్థిని అంజనప్రియ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసులలో ఆదేశించారు.

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్ లను అసభ్యకరరీతిలో దుర్భాషలాడారని అంజనప్రియ ఆరోపించారు. ఓ మహిళగా ఆ తిట్లను భరించలేకపోయానని 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్టు U/s 353(2), 352, 351(4) సెక్షన్ల కింద సి.ఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande