అమరావతి, 3 ఆగస్టు (హి.స.): మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండలెం జాతీయ రహదారుల ప్రారంభోత్సవం అనంతరం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు. మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండలెం చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ 2 జాతీయ రహదారులు రాయలసీమ ప్రాంత పురోగతిని వేగవంతం చేయడంలో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి