శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేత
శ్రీశైలం, 3 ఆగస్టు (హి.స.)వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వచ్చే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు డ్యామ్‌ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,17,480 క్యూసెక్కులు కాగా, ఔట్‌
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేత


శ్రీశైలం, 3 ఆగస్టు (హి.స.)వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వచ్చే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు డ్యామ్‌ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,17,480 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 65,851 క్యూసెక్కులుగా ఉంది. అలాగే, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, నీటిమట్టం 882.10 అడుగులగా ఉంది. వరద తీవ్రత తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తి నిరవధికంగా కొనసాగుతుంది. కాగా, భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగటంతో ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తటంతో శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం గేట్లు మూసివేయటంతో పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande