హైదరాబాద్, 8 ఆగస్టు (హి.స.)
కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ లో ఏడ్చారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారు..నీ వెంత? నీ బతుకెంతా? అని మండిపడ్డారు. వ్యక్తిత్వంలో ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. నేను ప్రభాకర్ రెడ్డి మాదిరిగా ప్యాకేజీ లీడర్ ను కాదని ప్రభాకర్ రెడ్డి మాదిరిగా కేసీఆర్ కు ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదన్నారు. నా క్యారెక్టర్ ఏమిటో ప్రభాకర్ రెడ్డికి కూడా తెలుసని అయినా ఎందుకు తొందరపడి మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డి దగ్గరున్నంత ఆస్తి నా దగ్గరుంటే రైతులకు పంచుతానన్నారు. నా గురించి కేసీఆర్, హరీశ్ రావుకు తెలుసన్నారు. మా మంత్రులు వాటాలు పంచుకోవడం కాదు కనీసం జనాలకు ఏమైనా చేద్దామంటే ప్రభుత్వ ఖజానాలో బీఆర్ఎస్ ఏమి మిగిల్చిందని దుయ్యబట్టారు. దొంగలు మీరైతే నిందలు మా మీద వేస్తారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీ తీరుగా ప్రైవేట్ కంపెనీ కాదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్