ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 8వ రోజు అన్నపూర్ణ 7 ఎకర్స్‌ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి తమ గళం వినిపించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కొందరికి పెంచి మి
ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 8వ రోజు అన్నపూర్ణ 7 ఎకర్స్‌ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి తమ గళం వినిపించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కొందరికి పెంచి మిగతా వారికి పెంచకపోవడం అన్యాయం అన్నారు. అన్ని యూనియన్ల వారికి పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. మొదటి ఏడాది 20 శాతం పెంచి రెండో ఏడాది 10 శాతం పెంచాలని కోరుతున్నట్టు తెలిపారు. దానికి ఛాంబర్ ఒప్పుకోవట్లేదని.. వాళ్ల కండీషన్లకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. నిర్మాత విశ్వ ప్రసాద్ మాకు లీగల్ నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావట్లేదు. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే ఛాంబర్ తో మాట్లాడుకోవాలి. పీపుల్స్ మీడియా మాకు రూ.90లక్షల బాకీ ఉంది. ఆయన మాకు క్షమాపణ చెప్పాలి

5

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande