హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మార్చే కీలక ప్రాజెక్టు అడవి తల్లి బాట.. ఈ ప్రాజెక్టు కింద కొత్త రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తవ్వాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 625 గిరిజన ఆవాసాలను రహదారి సౌకర్యంతో అనుసంధానించేందుకు రూ.1005 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలవుతోందన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు