భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ హనుమంతరావు
తెలంగాణ, యాదాద్రి భువనగిరి.8 ఆగస్టు (హి.స.) పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. భూ
యాదాద్రి కలెక్టర్


తెలంగాణ, యాదాద్రి భువనగిరి.8 ఆగస్టు (హి.స.)

పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇప్పటివరకు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయని పరిశీలించారు. అనంతరం జూలూరు- రుద్రవెల్లి - లో లెవెల్ బ్రిడ్జిపై మూసీ వరద నీటిని పరిశీలించారు. వరద నీటిలో చెత్తాచెదారం కొట్టుకరావడంతో వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, గ్రామ పంచాయతీ కమిటీ భవనాల్లో ఉండాలన్నారు. అలాగే శిథిలమైన భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలో వర్షం వస్తే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీళ్లు వేడి చేసి తాగాలని సూచించారు. వర్షపు నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. మూగ జీవాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యాక్సిన్, మందులు వేయాలని, వినియోగదారులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande