అమరావతి, 9 ఆగస్టు (హి.స.)):రేపటి నుంచి ఏపీవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్()తెలిపారు. ఇవాళ(శనివారం) మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలతో పీవీఎన్ మాధవ్ ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 14వ తేదీ నుంచి దేశ విభజన గాయాన్ని పురస్కరించుకుని మౌన ప్రదర్శనలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి మండల, జిల్లా స్థాయిలో తిరంగా ర్యాలీ నిర్వహించాలని సూచించారు పీవీఎన్ మాధవ్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ