తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 9 ఆగస్టు (హి.స.)
విద్యుత్ ట్రాన్స్ఫార్మరులు ధ్వంసం చేసి రాగి వైర్ ను చోరీ చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్లు పట్టుకున్నారు. శనివారం మీడియా సమావేశంలో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఐదుగురు వ్వ్యక్తులు ఒక గ్రూప్ గా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పొలాల పక్కన ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్స్ ను ధ్వంసం చేసి వాటి నుండి రాగిని దొంగలించారని తెలిపారు. వీరు కొత్తగూడెం, ములుగు జిల్లాలో తిరుగుతూ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో పగటి పూట చూసుకొని, రాత్రి వేళల్లో పొలాలు దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్లను ధ్వసం చేసి అందులోని రాగిని దొంగిలిస్తున్నారన్నారు.
దొంగిలించిన రాగిని పాల్వంచలోని ఒక దగ్గర దాచి పెట్టి ఎక్కవ మొత్తం అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. ఈక్రమంలోనే దమ్మపేట, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పస్రా, మంగపేట, పినపాక మండలంలో మొత్తం గా 258 కేజీల రాగిని దొంగిలించి పాల్వంచ లోని ఓ ఇంట్లో దాచి పెట్టి ఉంటే గుర్తించామని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు