:పాడేరు, 9 ఆగస్టు (హి.స
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈరోజు (ఆగస్టు 9న) పాడేరు పర్యటనకు రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో పాడేరు మండలం లగిశపల్లికి చేరుకోనున్నారు. 10.25 గంటలకు ప్రత్యేక వాహనంలో వంజంగికి వెళ్లనున్నారు. ఉదయం 11.40 గంటల వరకు వంజంగి సావడి దగ్గర ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానికుల గృహాల సందర్శన, కాఫీ రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఆ తర్వాత లగిశపల్లికి చేరుకుంటారు. కస్తూర్బాగాంధీ విద్యాలయం ఎదురుగా పలు పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటు ఒప్పందాలపై సంతకాలు చేసిన తర్వాత బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.
అలాగే, సీఎం చంద్రబాబు గిరిజన మహిళలతో థింసా నృత్యం చేయడంతో పాటు మట్టి గోడలతో నిర్మించిన హోం స్టేను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 2.20 గంటలకు లగిశపల్లిలోని హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో విజయవాడకు తిరిగి రానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ