సీతక్క తో తన అనుబంధం మాటలతో నిర్వచించలేనిది.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) సీఎం రేవంత్ రెడ్డికి తన నివాసంలో మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సహా పలువురు రాఖీ కట్టారు. భారీగా తరలివచ్చిన ఆడపడుచులు ఆయనకు రాఖీ కట్టేందుకు పోటీ పడ్డారు. అనంతరం మిఠాయి తినిపించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. సీఎం రేవంత్
మంత్రి సీతక్క


హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డికి తన నివాసంలో మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సహా పలువురు రాఖీ కట్టారు. భారీగా తరలివచ్చిన ఆడపడుచులు ఆయనకు రాఖీ కట్టేందుకు పోటీ పడ్డారు. అనంతరం మిఠాయి తినిపించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ మనుమడికి కూడా సీతక్క రాఖీ కట్టారు:

ఈ క్రమంలో సీఎం రేవంత్ ‘X' వేదికగా సీతక్కతో తనకు ఉన్న అనుబంధంపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. అక్షరాలతో రచించలేనిది.. మాటలతో నిర్వచించలేనిది సీతక్కతో తన అనుబంధమని కామెంట్ చేశారు. ప్రతి రాఖీ పౌర్ణమినాడు.. ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande