హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
తాజాగా ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, పూడ్చివేతల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ధర్మస్థల వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలోని ధర్మస్థల ట్రస్ట్ 70 ఏళ్లుగా ఒక కుటుంబం చేతిలో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి ఏడాదికి వంద కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. ఆ ట్రస్ట్ చైర్మన్ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసిందని వివరించారు. ధర్మస్థలలో దాదాపు 500 మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేసిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..