తిరుమల, 9 ఆగస్టు (హి.స.)తిరుమల, 9 ఆగస్టు (హి.స.) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) వెల్లడించింది.
రూ.300 ల శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 70,480 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు వచ్చింది. అలాగే స్వామివారికి 28,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి