ముదిగుబ్బ నుంచి మల్లేపల్లి గ్రామానికి వెళ్ళే.మార్గంలో ఈదులవంక వంతెన విరిగి పడింది
ముదిగుబ్బ, 9 ఆగస్టు (హి.స.) : అధికారుల నిర్లక్ష్యం..ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ఓ వంతెన కుప్పకూలిపోయింది. ముదిగుబ్బ నుంచి మల్లేపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఈదులవంక వంతెన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టికొట్టుకుపోయి శుక్రవారం విరిగిప
ముదిగుబ్బ నుంచి మల్లేపల్లి గ్రామానికి వెళ్ళే.మార్గంలో ఈదులవంక వంతెన విరిగి పడింది


ముదిగుబ్బ, 9 ఆగస్టు (హి.స.)

: అధికారుల నిర్లక్ష్యం..ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ఓ వంతెన కుప్పకూలిపోయింది. ముదిగుబ్బ నుంచి మల్లేపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఈదులవంక వంతెన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టికొట్టుకుపోయి శుక్రవారం విరిగిపడింది. తిమ్మనేనిపాళ్యం, ఇరికిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, ఆకుతోటపల్లి, గుట్టకిందపల్లి, మల్లేపల్లి, యంగన్నగారిపల్లి, రామిరెడ్డిపల్లి, దిగువపల్లి, పాయగట్టుపల్లి, తప్పెటవారిపల్లి, సిరిగారిపపల్లి, పెద్దన్నగారిపల్లి, పైపేడు గ్రామాల ప్రజలు ఈ మార్గం మీదుగా ప్రయాణం చేస్తుంటారు. వంతెన కూలిపోవడంతో మండల కేంద్రానికి రావాలంటే మలకవేములక్రాస్‌ మీదుగా మరో పది కిలోమీటర్లు చుట్టేసుకుని రావాల్సి ఉంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande