హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు బీజేపీ నేతలు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కావాలనే బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు