రాజకీయ పార్టీలపై ఈసీ వేటు.. 334 పార్టీలు అవుట్
న్యూఢిల్లీ 9 ఆగస్టు (హి.స.) కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు షాకిచ్చింది.ఎన్నికల్లో పోటీ చేయని, సరైన కార్యకలాపాలు లేని రాజకీయ పార్టీలను లిస్టు నుంచి తొలగించింది. ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరు సంవత్సరాల్లో ఒక్కసారైనా ఎన్నికల్లో
ఎలక్షన్ కమిషన్


న్యూఢిల్లీ 9 ఆగస్టు (హి.స.)

కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు షాకిచ్చింది.ఎన్నికల్లో పోటీ చేయని, సరైన కార్యకలాపాలు లేని రాజకీయ పార్టీలను లిస్టు నుంచి తొలగించింది. ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరు సంవత్సరాల్లో ఒక్కసారైనా ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి. అలా పోటీ చేయని పార్టీలను గుర్తింపు లేని పార్టీలుగా పరిగణించి లిస్టు నుంచి తొలగిస్తుంది. 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని 334 పార్టీలను ఈసీ లిస్టు నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 2854 రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలుగా ఉండగా.. తాజాగా కొన్ని పార్టీలను తొలగించడంతో ఆ సంఖ్య 2520కి తగ్గింది. ఈసీ వద్ద ఉన్న డేటా ప్రకారం.. దేశంలో 6 రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande