అమరావతి, 9 ఆగస్టు (హి.స.)
శ్రీశైలం, : నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు వైభవంగా జరిగాయి. దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమానికి మహిళలు వందలాదిగా తరలివచ్చారు. ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతీ కల్యాణ మండపంలో ఉచిత సామూహిక వ్రతాలను ఆచరించారు. సుమారు 1500 మందికి పైగా మహిళలు ఈ సామూహిక వ్రతంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు ఆలయ అధికారులు సారెను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ