హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొల్చారం, శివంపేట, చేగుంట, వెల్దుర్తి మండలాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. దూప్ సింగ్ తండాలో వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో హావేలి ఘనపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో వర్షానికి కూడవెల్లి వాగు పొంగిపొర్లుతుంది. 27 చెక్ డ్యాంలు వరద నీటితో నిండిపోయాయి. నర్సాపూర్‌లో వర్షాలకు భూగర్భ నీటిమట్టం పెరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు