హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)హైదరాబాద్: రాఖీ పండగ సందర్భంగా పెద్ద సంఖ్యలో నగరవాసులు సొంతూళ్లకు వెళ్తుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వనస్థలిపురం, భాగ్యలత, ఆర్టీసీ కాలనీ, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. హయత్‌నగర్ బస్టాండ్ వద్ద రోడ్డు కాస్త చిన్నగా ఉండటంతో వాహనాలు నెమ్మదిస్తున్నాయి. మెయిన్ రోడ్‌తోపాటు సర్వీసు రోడ్లపైకి వాహనాలు భారీగా చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హయత్ నగర్ దాటిన తర్వాత ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు