హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఎర్రవల్లిలోని వ్యవసాయ
క్షేత్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కాచెల్లెళ్లు కలిసి కేసీఆర్కు హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. ఈ రాఖీ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభ, అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్